ఓ ఇంటివాడు కాబోతున్న ప్రభాస్!
ప్రభాస్ పెళ్లి విషయంపై ఓ క్లారిటీకి ఆయన కుటుంబ సభ్యులు వచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి, ‘బాహుబలి పార్ట్-1′ రిలీజ్ తర్వాత ప్రభాస్ చేత మూడు ముళ్లు వేయించాలకున్నారు. అయితే, ‘బాహుబలి పార్ట్-2′ కోసం తాను పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉన్నందున.. ఈ సమయంలో పెళ్లి జరిగితే .. ఇది తనకు.. తాను చేసుకోబోయే అమ్మాయికి కూడా ఇబ్బందేనని చెప్పి పెళ్లి వాయిదా పడేలా చేశాడు ప్రభాస్. ‘బాహుబలి’ చారిత్రాత్మక విజయం సాధించిన దేశ వ్యాప్తంగా ప్రభాస్ కు గుర్తింపు వచ్చిన నేపథ్యంలో.. ప్రభాస్ మాట కాదనలేకపోయారు కుటుంబసభ్యులు. తాజాగా, వచ్చే ఏడాది అక్టోబర్‌లో ప్రభాస్ పెళ్లి చేసేయ్యాలని కృష్ణంరాజు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ‘బాహుబలి పార్ట్-2′ రిలీజ్ తో సంబంధం లేకుండా ఆ సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే ప్రభాస్‌ను ఓ ఇంటివాడిని చేసేయ్యాలని కృష్ణంరాజు పక్కాగా డిసైడ్ అయ్యారని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రభాస్ వివాహం చేసేయ్యాలని ఆయన ఫిక్స్ అయ్యారట. భీమవరంకు చెందిన ఓ అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. మరో వైపు, ‘బాహుబలి పార్ట్-2′ షూటింగ్ ఈ ఏడాది డిసెంబర్ లో మొదలయ్యి.. వచ్చే ఏడాది ఆగస్టు కల్లా పూర్తి కానుందని తెలుస్తోంది.
No comments:
Post a Comment